టీఆర్ఎస్ నేతలు మ‌రీ ఇంత అడ్వాన్స్ అయితే ఎలా..?

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేసిన కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ధ‌న్యవాదాలు తెలుపుతూ బ్యాన‌ర్లు వెలిసాయి. అదేంటి అస‌లు స‌భ మొద‌లు కానేలేదు అప్పుడే విజ‌య‌వంతం కావ‌డమేంటి అనుకుంటున్నారా. అవును మ‌రీ టీఆర్ఎస్ నేత‌లు కాస్త అడ్వాన్స్ మ‌రి. ఇబ్ర‌హీం ప‌ట్నం ఎమ్మెల్యే పేరుతో వెల‌సిన ఈ పోస్ట‌ర్లు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తున్నాయట‌.

సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో 25 లక్షల మంది కార్యకర్తలతో ప్రగతి నివేదన సభను టిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేరుతో కొన్ని బ్యానర్లు వెలిశాయి. ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని కోరే బదులుగా ప్రగతి నివేదన సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో బ్యాన‌ర్ల‌ను తొల‌గించి చేసిన త‌ప్పును స‌రిదిద్దుకున్నార‌ట టీఆర్ఎస్ నేత‌లు.