లోకేష్.. ఇంత రొమాంటిక్’నా.. ?
ఆంధ్రప్రదేష్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ తండ్రి మాదిరిగానే హుందాగా కనిపిస్తారు. మొహంలో సీరియస్ నెస్ కనిపిస్తుంటుంది. పెద్దగా నవ్వడం, వెకిలి మాటలు ఆయనకు రావు. రాజకీయ వార్తల్లో తప్ప… బయటి వ్యవహారాల్లో ఆయన కనిపించడు. వినిపించడు. ఐతే, ఆదివారం లోకేష్ రొమాంటిక్ గా కనిపించి ఆకట్టుకొన్నారు.
లోకేష్-బ్రహ్మణి ఆదివారం తమ పెళ్లి రోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన సతీమణికి లోకేశ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘గత పదకొండేళ్లుగా.. నిజంగా తనను ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే, ఎంతో విలువనిచ్చే వ్యక్తి ఉందని ప్రతి రోజు ఉదయం గుర్తు చేసుకుంటూ ఉంటా. బ్రహ్మణి ఆ దేవుడు తనకిచ్చిన గొప్ప బహుమతి. అందుకు భగవంతుడికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్ పెట్టాడు.
ఇప్పుడీ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్న బాబులో ఇంత రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతలోనే తేరుకొని యువ నాయకుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారనుకోండీ.. !
Woke up every day in the past 11 years knowing that I am being truly loved, valued and cared for. You being in my life has been one of the best gifts God has bestowed on me and I thank him for that. Happy anniversary @brahmaninara pic.twitter.com/FDMIxcPzRx
— Lokesh Nara (@naralokesh) August 26, 2018