బిగ్ బాస్ పండగ స్పెషల్.. అదిరింది !

శని, ఆదివారాలు వచ్చాయంటే బిగ్ బాస్’పై ప్రత్యేక ఆసక్తి. ఈ రెండ్రోజులు హౌస్ సభ్యులతో పాటుగా, నానిని కూడా చూసేయొచ్చు. నాని తనదైన స్టయిల్ లో కావాల్సినంత వినోదాన్ని పంచుతాడు. ఐతే, ఈ ఆదివారం రాఖీ పండగ స్పెషల్ అదిరిపోయింది. నాని హోస్ట్ గా చేయలేదు. ఏకంగా హౌస్ లోకి వెళ్లిపోయాడు. వాళ్లతో కలిసి సందడి చేశాడు. వారికి బోలేడు బహుమతులు అందజేశాడు. మొత్తంగా.. ఇంటి సభ్యులు, ప్రేక్షకులు మరిచిపోని ఏపీసోడ్ ని అందించారు.

సీజన్-1లో తారక్ ఓసారి బిగ్ బాస్ హౌస్’లోకి వెళ్లిపోయాడు. స్వయంగా వంట చేసి.. ఇంటి సభ్యులకు రుచి చూపించాడు. వాళ్లతో కలిసి భోజనం కూడా చేశారు. సరిగ్గా నాని కూడా అదే చేశాడు. కాకపోతే.. నాని వంట చేయలేదు. ఇంటి నుంచి తీసుకొచ్చిన స్పెషల్ ఐటమ్స్ ని.. స్వయంగా ఇంటి సభ్యులకు వడ్డించారు. ఆ తర్వాత తానూ వాళ్లతో కలిసి భోజనం చేశారు.

అంతకంటే ముందు.. హౌస్ సభ్యులతో సరదాగా గడిపారు నాని. మహిళా సభ్యులు నానికి రాఖీ కట్టగా.. వారికీ చీరలని బహుమతిగా ఇచ్చారు నాని. ఆ తర్వాత సభ్యులకి ఇంటి నుంచి వచ్చిన రాఖీలు, దాంతో పాటు వచ్చిన లెటర్స్ ని స్వయంగా నాని చదివి వినిపించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇంటి సభ్యులపై జరుగుతున్న ప్రచారం వీడియోలని చూపించారు. ఇవి ఫన్నీగా ఉండటంతో.. ఫుల్లుగా నవ్వించేశాయ్. ఆ తర్వాత భోజనం.. మళ్ళీ కొన్ని కబర్లు.. ఫైనల్ గా ఎలిమినేష్. ఈ వారం పూజా ఎలిమినేట్ అయింది. మొత్తంగా.. రాఖీ పండగ స్పెషల్ అదిరిపోయింది.