డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవం.
డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ పగ్గాలు చేపట్టారు. అధ్యక్ష పదవికోసం కుటుంబంలో చీలికలు వచ్చాయంటూ గతంలో ఓరేంజ్ లో వార్తలు రావడంతో అసలు కరుణానిధి రాజకీయ వారసుడెవరనేది ఓ సస్పెన్స్ గా మారింది. యాభైఏళ్ల పాటు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న కరుణానిధి మరణానంతరం పార్టీ విషయంలో రాజకీయ వారసుడిపై ఓ రకమైన చర్చ జరిగింది. స్టాలిన్ సోదరుడు కూడా డీఎంకే అధ్యక్ష పదవికి పోటీ పడతారని అందుకే అంతర్గతంగా వారిద్దరి మధ్య పోటీ నెలకొందనే వార్తు వచ్చాయిక కూడా.
అయితే అంతర్గత వివాదాలను కుటుంబంలోనే మాట్లాడుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేనేజ్ చేసినట్లుగా తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాట అధికార పార్టీకి అంతగా ఆదరణ లేకపోవడంతో బలమైన పార్టీగా డీఎంకే ఎదగాలంటే సరైన నాయకత్వం అవసరమనే అభిప్రాయంతో స్టాలిన్ ను ముందు నిలబెట్టారని భావిస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం స్టాలిన్ మాత్రమే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైపోయింది. దీంతో పార్టీకి రెండవ అధ్యక్షుడిగా స్టాలిన్ నియామకం లాంఛన ప్రాయమైంది.