వ‌ర‌వ‌ర‌రావు ఇంటిపై పోలీసుల దాడులు..!!

హైదరాబాద్ లో ఎనిమిది మంది ఇళ్ల‌పై పూణే పోలీసుల దాడులు నిర్వ‌హిస్తున్నారు. గతంలో అరెస్ట్ చేసిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికి లేఖ ఆధారంగా సోదాలు నిర్వ‌హిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వరవరరావు , వరవర రావ్ కూతురు ,ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ , జర్నలిస్ట్లు కూర్మనాథ్ , క్రాంతి టేకుల , మరో ఇద్దరు విరసం ప్రతినిధుల ఇండ్ల లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

మహారాష్ట్ర లోని గోరేగావ్ లో 2017 ఏప్రిల్ 28 న మావోయిస్ట్ సానుభూతి పరుడు రోనా విల్సన్ కామ్రేడ్ ప్రకాష్ కు రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. రోనా విల్సన్ ల్యాప్ టాప్ లో వరవరరావు సహకారంతో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు ఉన్న లేఖ‌ను కూడా పోలీసులు గుర్తించిన‌ట్లు చెబుతున్నారు. మూడు నెలల క్రితం రోనా విల్సన్ తో పాటు మరో నలుగురిని మ‌హారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయ‌గా వ‌ర‌వ‌ర‌రావుపై కూడా కుట్ర కేసు నమోదు చేశారు.

మరిన్ని ఆధారాల కోసం విరసం నేత వరవరరావు ఇంట్లో ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు మహారాష్ట్ర పోలీసులు. పోలీసులు సోదాలు నిర్వ‌హించేట‌పుడు ఇంటిద‌గ్గ‌ర ఎవ‌రూ ఉండొద్ద‌ని ఆంక్ష‌లు విధించారు. ప్రజా గొంతుకను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమే వరవరరావు పై కుట్ర కేసని ప్ర‌జా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ హత్య కుట్రకు వరవరరావు కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు ప్ర‌జా సంఘాల నేత‌లు.

పోలీసుల ఆంక్ష‌ల‌పై ప్ర‌జా సంఘాలు మండిప‌డుతున్నాయి. పోలీస్ వైఖ‌రిని నిర‌సిస్తూ ప్ర‌జాసంఘాలు వ‌ర‌వ‌ర‌రావు ఇంటికి చేరుకున్నాయి. ఆంక్ష‌ల పేరుతో త‌మను అడ్డుకోవ‌డ‌మేంట‌ని, ప్ర‌జా గొంతుక‌నిఅణ‌చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్ర‌జా సంఘాలకు పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.