అక్కడ కాంగ్రెస్ కు మద్దతిస్తే తప్పులేదు..
తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లో టీడీపీ లేదని, అయితే ఆంధ్రాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని ఆయన చెప్పారు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, అయితే ఏపీలో పొత్తు పెట్టుకోవడం సరి కాదన్నారు.
బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీ కి న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ ను నమ్మి చూస్తే తప్పుకాదని ఆయన అన్నారు. పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరని చెప్పుకొచ్చారు. ముందస్తు ఎన్నికలకు పోవడం కేసీఆర్ రాజకీయ కుయుక్తి అని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తో టీఆరెస్ పొత్తు ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ముస్లిం దూరం అవుతారనే, అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుకు వెళుతున్నాడని కేసీఆర్ రాజకీయ వ్యూహంపై ఆయన అభిప్రాయాన్ని చెప్పారు.