ఫైళ్ల క్లియ‌రెన్స్ లో అంత హ‌డావుడి ఎందుకు..?

ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హారం పై టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాంపై ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు స‌చివాల‌యం మొహం చూడ‌కుండా ఇప్పుడు ఫైళ్ల దుమ్ము దులుపుతున్నార‌ని విమ‌ర్శించారు. నేల‌మాలిగ‌ల్లో దాగిన ఫైళ్లపై ఇప్పుడెందుకు సంత‌కాలు పెడుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హ‌డావిడిగా ఫైళ్లు ఎందుకు క్లియ‌ర్ చేస్తున్నార‌ని, మ‌ద్యంత‌ర ఎన్నిక‌ల అవ‌స‌రం ఏమొచ్చింద‌ని అన్నారు. ఫైళ్ల క్లియ‌రెన్స్ లో ఎన్ని కోట్లు చేతులు మారుతాయోన‌ని , ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.