నాగ్ బర్త్ డే పిక్స్ చూశారా.. ?


‘దేవదాస్’లు నాగ్, నానిలు ఫస్ట్ పెగ్ వేసేశారు. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు పాటేసుకొనేందుకు రెడీ అయ్యారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. రేపు నాగ్ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ‘దేవదాస్’ చిత్రంలోని తొలి సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. అంతకంటే ముందే నాగ్ బర్త్ డే కానుకగా దేవదాస్ చిత్రంలో నాగ్ పిక్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నాగ్ యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడీ పిక్స్ ఆకట్టుకొంటున్నాయి. వయసు పెరుగుతున్నా.. నాగ్‌ అందం అలాగే ఉందని కామెంట్లు చేస్తున్నారు.

నాగ్-నానిల మల్టీస్టారర్ గా దేవదాస్ తెరకెక్కుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రష్మిక, ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నాగ్ దేవ్ పాత్రలో మాఫియా డాన్ గా, నాని దాస్ పాత్రలో డాక్టర్ గా కనిపించబోతున్నారు.
ఇటీవల విడుదల ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వస్తుంది. టైటిల్ కి తగ్గట్టుగా హీరోలిద్దరు సిట్టింగ్.. ఫస్ట్ పెగ్ తో టీజర్ ని కట్ చేశారు. నాని మాటల్లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే నవ్వించేశాడు. సినిమా మొత్తం ఇలా సరదా సరదా ఉంటుందని చెబుతున్నారు.