వరవరరావును ఇంట్లో వదిలి వెళ్లిన పోలీసులు.
విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును మహారాష్ట్రలోని పూణే పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ గాంధీనగర్లోగల ఆయన ఇంట్లో వదిలిపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై వరవరరావును రెండురోజుల క్రితం పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వరవరరావునేగాక దేశంలోని మొత్తం 5గురు విప్లవ రచయితలను కూడా అరెస్టు చేశారు. అయితే దీనిపై సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో జైలుకు అవసరం లేదని, గృహ నిర్భందం చాలని సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పూణే పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటి దగ్గర వదిలి వెళ్లారు.