హృతిక్ డేటింగ్’కు పిలవలేదట
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరోసారి బుక్కయ్యాడు. ఆయన హీరోయిన్ దిశా పటానీని బలవంతం చేశాడు. ఆమెని బెదిరించారని, సినిమాలో అవకాశం కావాలంటే తనతో డేటింగ్‌కు రావాలని అడిగినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అదే సమయంలో గతంలో కంగనా రనౌత్ ఏపీసోడ్ ని పోల్చి చూస్తున్నారు.
తాజాగా, ఈ ప్రచారంపై హృతిక్ స్పందించారు. ‘మీకు పాపులారిటీ కావాలంటే నన్నే నేరుగా అడగొచ్చు కదా..ఇలాంటి అసభ్య, అవాస్తవ వార్తలు ప్రచురించడం ఎందుకు?’ అంటూ హృతిక్ వ్యంగంగా కామెంట్లు చేశారు. దిశా కూడా తన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఓ పోస్ట్ పెట్టారు.
‘నా గురించి హృతిక్ సర్ గురించి అర్థంలేని వార్తలు వెలువడుతున్నాయి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. నేను ఆయన్ను కలిసినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడారు. అంత గొప్ప వ్యక్తి గురించి వస్తున్న వార్తలను ఖండించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆయనతో కలిసి నటిస్తున్న సినిమా నుంచి నేను తప్పుకోవడంలేదు.’ అని వెల్లడించారు దిశా.