జీవిత యాత్ర ముగిసింది

మాజీ ఎంపీ, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్‌రామ్‌ నిప్పంటించారు. కుటుంబ సభ్యులు. అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర మెహదీపట్నం నుంచి ఎన్‌ఎండీసీ, ఎస్డీ ఆసుపత్రి, రేతిబౌలి, నానల్‌ నగర్‌, టోలీచౌక్‌, షేక్‌పేట నాలా, విస్పర్‌ వ్యాలీ జక్షన్‌ మీదుగా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకూ సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు ఇంటి నుంచి వైకుంఠ రథం వరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ పాడె మోశారు

తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,తుమ్మల నాగేశ్వరరావు, ఏపీమంత్రులు నారా లోకేశ్‌, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.