‘మహాప్రస్థానం’లో హరికృష్ణ స్మారకం!
రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు హరికృష్ణ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. గురువారం సాయంత్రం మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయిన తరువాత కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ప్రభుత్వం స్మారక స్థూపం నిర్మించే అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నందమూరి హరికృష్ణ స్మారక స్థూపం కోసం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలోని ఒక భాగంలో సుమారు 200గజాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.