రాహుల్ పిలుపుతో ఢిల్లీకి ఉత్తమ్..
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పిలుపుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఢిల్లీకి వెళ్లారు. ముందస్తు ఎన్నికల కసరత్తు, పార్టీ పదవులపై ఉత్తమ్ రాహుల్ తో చర్చించనున్నారు. ఎన్నికల యాక్షన్ ప్లాన్ పై రాహుల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ మ్యానిఫెస్టో, ప్రచార కమిటీలపై చర్చించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబరు2న టీఆర్ఎస్ సభ నేపథ్యంలో పార్టీ పదవులను ముందుగానే ప్రకటిస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్ పదవిపై రేవంత్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ పదవి ఆయకు కేటాయిస్తారా లేదా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మొత్తంగా రాహుల్ తో భేటీ అనంతరం ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.