డీఎస్ కుమారుడు సంజయ్ కి ఊర‌ట‌.

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీ‌నివాస్ కుమారుడు సంజ‌య్ కేసులో ఆయ‌న‌కు కాస్త ఊర‌ట క‌లిగింది. గ‌తంలో లైంగిక వేధింపుల కేసులో హైడ్రామా న‌డుమ జైలుకెళ్లిన సంజ‌య్ కి జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్ళిన నిజామాబాద్ మాజీ మేయ‌ర్ సంజ‌య్ కి ఊర‌ట క‌లిగింది. బెయిలు కోసం జిల్లా కోర్టును ఆశ్ర‌యించిన సంజ‌య్ కి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది కోర్టు. దాదాపు 19రోజుల‌పాటు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మేయ‌ర్ సంజ‌య్ శుక్ర‌వారం జైలునుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.