అల్లుడు బాబు.. బంగారం !

డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమా తీయడం దర్శకుడు మారుతి ప్రత్యేకత. మతిమరుపు కాన్సెప్టుతో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో నానిని మతిమరుపు వ్యక్తిగా చూపించి ఓ రేంజ్ లో వినోదాన్ని పండించాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ ని ‘బాబు బంగారం’గా చూపించాడు. ఇందులో వెంకీని అతి దయగల వ్యక్తిగా చూపించాడు. కామెడీ బాగానే వర్కవుట్ అయినా.. బాబు హిట్ కొట్టలేకపోయాడు. ‘మహానుభావుడు’లో అతిశుభ్రత కలిగిన హీరోను చూపించాడు. ఆ పాత్రలో శర్వానంద్ అదరగొట్టేశాడు. ఇప్పటివరకు మారుతి మూడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి.

మారుతి తాజా చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమాలో అత్త పాత్రను అలాగే అల్లుడి పాత్రను పూర్తిగా ఈగో వున్నా రోల్స్ గా తీర్చిదిద్దాడు. హీరోయిన్ కు కూడా ఇగో ఎక్కువే. టీజర్ లో ‘ముందు నీవు ఐ లవ్ యు చెప్పు తరువాత నేను లవ్ యు టు చెప్తా’ అంటుంది హీరోయిన్. ‘నాలాగే నీకూ ఈగో ఎక్కువని విన్నాను .. దాని దమ్మేంటో చూడాలని వుంది’ అంటూ ట్రైలర్ లో రమ్యకృష్ణ తో ఓ డైలాగ్ కూడా చెప్పించాడు. దీన్ని బట్టి ఇదో పూర్తిగా ఇగో కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తోంది.

అంతేకాదు.. ‘శైలజారెడ్డి అల్లుడు’కు ‘బాబు బంగారం’ సినిమాకు పోలికలు కనిపిస్తున్నాయి. ‘బాబు బంగారం’ సినిమాలో వెంకీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘బొబ్బిలి రాజా’ సాంగ్స్ ని బ్యాక్ గ్రౌండ్ వాడేశాడు. కామెడీ సీన్స్ అది మంచి ఫీల్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు శైలజారెడ్ది అల్లుడు సినిమా కోసం నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘హలో బ్రదర్’ థీమ్ సాంగ్ ని వాడేశాడు. ట్రైలర్ లోనూ అది వినిపించింది. దీంతో.. అల్లుడు బాబు బంగారం అని చెప్పుకొంటున్నారు అక్కినేని అభిమానులు.