హరికృష్ణ చికిత్స చేస్తూ సెల్ఫీ…! ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం..!!
ప్రస్తుతం సెల్ఫీ పిచ్చి ఎంత ముదిరిందంటే అది ప్రాణాలమీదకు తెస్తున్నా జనం మారడం లేదనేది చాలా సంఘటనలు మనకు ఉదహరిస్తున్నాయి. ప్రముఖులు కనిపిస్తే సెల్ఫీ తీసుకోవడం సహజం, కానీ ఇక్కడ సెల్ఫీ పిచ్చి ముదిరి పాకాన పడి ఇలా చేశారో, లేక కనీస విజ్ఞత కోల్పోయి ఇలా ప్రవర్తించారో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు
ఈ నెల 29న నల్గొండ సమీపంలో కారు ప్రమాదంలో తల పగిలి రక్త కారుతున్న హీరో హరి కృష్ణ ను స్థానికులు కామినేని హాస్పిటల్ కు తరలించారు…అక్కడున్న సిబ్బంది వైద్యం చేయడం మాని…ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న హరికృష్ణ తో సెల్ఫీ దిగారు. ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో కామినేని ఆసుపత్రి సిబ్బంది చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.