టీజేఎస్ లో పొత్తుల గురించి చర్చపై క్లారిటీ ఇచ్చిన కోదండరాం.
నాలుగేళ్ళ తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, ఈ నాలుగేళ్ళల్లో ఒక కుటుంబమే ప్రగతి సాధించిందని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని సాధించటంలో విఫలమైందని, తమను ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోయినా .. ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంలో జరుగుతోన్న తప్పులు తెలిసి కూడా ప్రశ్నించకపోతే ఇంకా పెద్దతప్పు అవుతుందని ఆయన అన్నారు.
చదువుకున్న వారు మౌనంగ ఉండకూడదని కోదండరాం అన్నారు. అభ్యర్థుల ప్రకటన అంశం ఆయా పార్టీలకు సంబంధించిన అంశమని,టీజేఎస్ అభ్యర్థులను మాత్రం సరైన సమయంలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తమది కొత్తగా వచ్చిన పార్టీ. పొత్తులుండవని మొదట నుంచి చెప్తున్నామని, పొత్తులపై మాపార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు కోదండరాం.