చట్టాన్ని ఉల్లంఘించమని కేసీయారే చెబుతున్నాడు..!!
కేసీఆర్ మధ్యయుగాల చక్రవర్తి లాగా ప్రవర్తిస్తున్నాడని, రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడనని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ ..ఇప్పుడు తానే స్వయంగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ సభకు ఉరికో ట్రాక్టర్ పై రావాలని ప్రజలకు చెప్పిన కేసీఆర్, ట్రాక్టర్ పై ప్రజా రవాణా నేరం కాదా ..చట్టాన్ని ఉల్లంఘించమని నేరుగా కేసీఆర్ చెబుతున్నాడని ఆయన విమర్శించారు. ఖమ్మం నుంచి దాదాపు రెండు వేల ట్రాక్టర్లు వస్తాయని తుమ్మల నాగేశ్వర్ రావు, పువ్వాడ అజయ్ లు చెబుతున్నారని, చట్టాన్ని ఉల్లంఘించిన కేసీఆర్,తుమ్మల,పువ్వాడపై అధికారులు కేసులు బుక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హెచ్ఎండీఏ కమీషనర్ జనార్దన్ రెడ్డి సర్కార్ కు వత్తాసు పలికెలా ప్రవర్తిస్తున్నారని, టోల్ గేట్ లో టిఆర్ఎస్ కు మినహాయింపులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఔటర్ రిగ్ రోడ్ ను సర్వనాశనం చేస్తున్నా .. అధికారులు ఏం చేస్తున్నారన్నారాయన.ఔటర్ రోడ్ పై ఎక్కడ పడితే అక్కడ తూట్లు పొడుస్తున్నారని, కొంగర కలాన్ లో వేల చెట్లను నరికేస్తున్నారని ఆరోపించారు రేవంత్. హరితహారం పేరుతో చెట్లు నాటినట్లు ఫోటోలకు ఫోజులిచ్చిన టిఆర్ఎస్ నేతలు సినిమా నటులు ఇప్పుడు ఇన్ని చెట్లు నరికినందుకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కళాకారులను సభలో ఆడిపాడితే హాజరు వేస్తామని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సర్కార్ ఉద్యోగులుగా ఉన్న కళాకారులు పార్టీ సమావేశాల్లో ఎలా పాటలు పాడుతారని రేవంత్ ప్రశ్నించారు.