‘ప్రగతి నివేదన సభ’ పార్కింగ్ కు దారులివే..
సెప్టెంబర్2 ఆదివారం జరిగే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది అధికార టీఆర్ఎస్. ఒక్కోవైపు నుంచి వచ్చే టీఆర్ఎస్ శ్రేణులు సభాస్థలికి చేరుకునేందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, కొంగర కలాన్ గ్రామంలో జరిగే భారీ సభకు రాష్ట్ర నలుమూలల నుంచే వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా పార్కింగ్ సంబంధించి ఎవరెవరు ఎక్కడ పార్క్ చేయాలి అనే వివరాలను రూట్ మ్యాప్ లో ఉంచారు. వివిధ హైవేల నుంచి వచ్చే వారికోసం పార్కింగ్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ హైవే నుంచి భద్రాచలం, అశ్వరావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర,ఇల్లందు, పినపాక, ఖమ్మం, పాలేరు, హుజూర్ నగర్, కోదాడ, సూర్యపేట్, నకేరకల్, నల్గొండ, మునుగోడు నుంచి వచ్చే వారు
పెద్ద అంబర్ పేట్ ఓఆర్ఆర్ ఎక్జిట్ నం. 11 సర్విస్ రోడ్ నుంచి కోహెడ మీదుగా మంగల్ పల్లి మీదుగా, కొంగర విలేజ్ లో ఉన్న Jockpot/ TSIIC వెంచర్ లో వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
సాగర్ హైవే నుంచి మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వారు
ఇబ్రహీంపట్నం లోని శాస్తా గార్డెన్ వద్ద ఎడమ వైపు కు- ఎలిమినేడు- కొంగర విలేజ్ లో ఉన్న Jockpot/TSIIC వెంచర్ లో పార్కింగ్ చేసుకోవాలి.
శ్రీశైలం హైవే నుంచి అచ్చంపేట్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మహేశ్వరం నుంచి వచ్చేవారు రాచూలూర్ గేట్ నుంచి కుడి వైపుకు తిమ్మాపూర్- కొంగర గ్రామం లో ఉన్న Jockpot / TSIIC వెంచర్ నందు పార్కింగ్ చేయాలి.
మహబూబ్ నగర్ వైపు నుంచి గద్వాల్, అలంపూర్ , వనపర్తి, జడ్చర్ల , మహబూబ్ నగర్, దేవేరకద్ర , కోడంగల్, మక్తల్ , నారాయణ్ పేట్, షాద్ నగర్ నుంచి వచ్చేవారు పాలమాకుల , స్వర్ణభారతి ట్రస్ట్, పెద్ద గోల్కొండ సర్వీస్ రోడ్ అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.
నిజామాబాద్ వైపు నుంచి ముదోల్, ఆర్మూర్, )భోదన్, నిజామాబాద్ అర్బన్, నిజమాబాద్ రూరల్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, భోథ్, ఖానాపూర్, నిర్మల్, బాల్కొండ, మెదక్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు మేడ్చల్/కండ్లకోయ వద్ద ORR-EXIT-5 వద్ద ఎక్కి- పటాన్ చెర్వు, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా వచ్చి తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుంచి FABcity వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
జహీరాబాద్ వైపు నుంచి జహీరాబాద్, నారాయణ ఖేడ్ ఆందోల్, సంగా రెడ్డి పటాన్ చెర్వు నుంచి వచ్చే వాహనాలు పటాన్ చెర్వు వద్ద ORR-EXIT- ఎక్కి- పటాన్ చెర్వు, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా వచ్చి తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుంచి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.
వికారాబాద్ వైపు నుంచి తాండూర్, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ నుంచి వచ్చే వాహనాలు TS పోలీసు అకాడమి వద్ద ORR EXIT -18 వద్ద ఎక్కి-తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.
వరంగల్ వైపు నుంచి మంథని, ములుగు , భూపాలపల్లి , వర్దన్నపేట్, డోర్నకల్,స్టేషన్ ఘన్పూర్, వరంగల్-ఈస్ట్ , వరంగల్ వెస్ట్ , పరకాల , నర్సంపేట్, మహబూబాబాద్, పాలకుర్తి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, భువనగిరి నుంచి వాహనాలు ఘట్కెసర్ వద్ద ORR EXIT -09 వద్ద ఎక్కి- బొంగులూర్ వద్ద ORR Exit No. 12 వద్ద దిగి సర్విస్ రోడ్ నుండి కల్వకోలు లక్ష్మి దేవమ్మ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేయాలి.
సిద్దిపేట్ వైపు నుంచి సిర్పూర్,బెల్లంపల్లి, ఆదిలాబాద్, చెన్నూరు,మంచిర్యాల , ధర్మపురి, రామగుండం, చొప్పదండి , కరీంనగర్ ,మానకొండూర్ ,హుస్నాబాద్ , హుజూరాబాద్, కొమరం భీమ్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, వేములవాడ, దుబ్బాక, సిద్దిపేట్, గజ్వేల్, ఆసిఫాబాద్ నుంచి వచ్చే వాహనాలు శామీర్ పేట్ వద్ద ORR EXIT -07 వద్ద ఎక్కి- ఘట్కెసర్- బొంగులూర్ వద్ద ORR Exit No. 12 వద్ద దిగి సర్విస్ రోడ్ నుండి కల్వకోలు లక్ష్మి దేవమ్మ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్ , ముషీరాబాద్, మల్కాజ్ గిరి, అంబర్ పేట్, ఉప్పల్ మలక్ పేట్, వైపు నుంచి వచ్చే వారు ఉప్పల్, LB నగర్, సాగర్ రింగ్ రోడ్, మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ నుంచి, పహడిషరీఫ్ మీదుగా ఆగాఖాన్ అకాడెమీ నుండి Wonderla వద్ద పార్కింగ్ చేయాలి.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, రాజేంద్రనగర్, కార్వాన్ వైపు నుంచి వచ్చేవారు TS పోలీసు అకాడమి వద్ద ORR EXIT -17 వద్ద ఎక్కి-తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సనత్ నగర్ వైపు నుంచి వచ్చేవారు పటాన్ చెర్వు వద్ద ORR-EXIT-03 ఎక్కి- పటాన్ చెర్వు, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా వచ్చి తుక్కుగూడ Exit No. 14 వద్ద దిగి, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.
ఛార్మినార్, చంద్రాయన్ గుట్ట, బహదూర్ పుర, యకత్ పుర, గోషామహల్ వైపు నుంచి వచ్చేవారు చాంద్రాయణగుట్ట -పహడిషరీఫ్ మీదుగా ఆగాఖాన్ అకాడెమీ నుండి Wonderla వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. సభ ముగించుకొని వెళ్ళేటపుడు వచ్చిన ధారిలోనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.