బిగ్ బాస్ 2 : బై బై గణేశా.. !

గణేషుడి పండగ ఇంకా రానేలేదు. బిగ్ బాస్ హౌస్ లో గణేష్ కి బై బై చెప్పేశారు. అదేనండీ.. ఎలిమినేషన్ స్టార్ గణేష్ ఈసారి ఎలిమినేషన్ నుండి తప్పించుకోలేకపోయారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఇందులో భాగంగా శనివారం గణేష్ ని ఎలిమినేట్ చేశారు. కామన్ మేన్ కోటాలో హౌస్ లోకి వెళ్లిన గణేష్ ప్రతివారం ఎలిమినేషన్ లిస్టులో ఉంటూ వచ్చారు. ఒక్కవారం తప్ప. ప్రతిసారి ఎలిమినేషన్ నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్తూ వచ్చారు. ఐతే, ఈ వారం గణేష్ తప్పించుకోలేకపోయారు. ఆయన్ని ఎలిమినేట్ చేస్తున్నట్టు నాని ప్రకటించేశారు. ఐతే, గణేష్ ని సాగనంపే కార్యక్రమం శనివారం కాలేదు. సమయభావం కారణంగా.. దాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. గణేష్ ఎలిమినేషన్ తో ఆదివారం షో ప్రారంభం కానుంది. ఇక, రేపు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే మరో సభ్యుడు ఎవరు ? అన్నది ఆసక్తిగా మారింది.