ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు…. నిండుకుండలా నాగార్జున సాగర్.
నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారడంతో అధికారులు ఆదివారం ఉదయం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ కు ఇన్ ఫ్టో 1.54లక్షలు కాగా, ఔట్ ఫ్లో 47,817 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 59 అడుగలకు ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 295 టీఎంసీలుగా నమోదయింది. నాలుగేళ్ల తర్వాత నిండుకుండలా మారిన సాగర్ ను చూసి ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.