‘ముందస్తు’పై కాంగ్రెస్’కు కేటీఆర్ సవాల్..!
ఒకేసారి సభ, క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయటం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శమని మంత్రి కేటీఆర్ అన్నారు. విపకాక్షలది కాగి గోలని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సభకు 25వేల మంది కూడా రాలేదని, కాంగ్రెస్ సభ లెక్కలు మేము అడగలేదని చెప్పారు కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీకి 46లక్షల మంది క్రీయాశీలక సభ్యులున్నారని, అందులో సగం కొంగర్ కొలాన్ వచ్చినా 25లక్షలవుతారని చెప్పారాయన. బీరు, బిర్యానీ ఇచ్చి సభలకు ప్రజలను తరలించడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు.
ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ కు సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. ముందస్తుకు టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందని,
ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటానికి కాంగ్రెస్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారాయన. ముందస్తుపై కోర్టుకు వెళ్లామనటం కాంగ్రెస్ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ఏమనుకుంటున్నదనేది తమకవసరంల ఏదని, ప్రజలేమనుకుంటున్నారన్నదే తమకు ముఖ్యమంని చెప్పారు కేటీఆర్. ముందస్తుకు టీఆర్ఎస్ రెడీగా ఉందని అందులో ఎలాంటి సందేహం లేదని, శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారని ఆయన తేల్చి చెప్పారు.