చరణ్ బయట మొదలెట్టాడు

రామ్ చరణ్ యాక్షన్ లోకి దిగాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. బోయపాటి సినిమాలు అంటేనే ఊరమాస్ కు కెరాఫ్. యాక్షన్ హైలైట్ ఉంటుంది. రామ్ చరణ్ సినిమా ఈ కోవకు చెందినదే. ఇన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది. ఇటీవలే కొత్త షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లింది. అక్కడ అజర్బైజాన్ లో ఓ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఆ ప్రాంతంలో షూటింగ్ జరుపుకొంటున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ రోజు నుంచే అక్కడ షూటింగ్ ప్రారంభమైంది.

చరణ్, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్ తదితరుల ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. దాదాపు 25 రోజుల పాటు సాగే షెడ్యూల్ లో కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారు. దీంతో పాటు చరణ్-కైరా అద్వానీలపై ఓ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా చరణ్ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడ్డారు అభిమానులు. ఆ తర్వాత బాబాయ్ పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న చరణ్ సినిమా నుంచి గిఫ్ట్ వస్తుందని అనుకొన్నారు. కానీ, రాలేదు. యూరప్ షెడ్యూల్ నుంచి తిరిగొచ్చాక.. చరణ్ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.