జ‌గిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన క‌విత‌

టీఆర్ఎస్ సెప్టెంబ‌ర్ లోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పిన కేసీఆర్ కంటే ముందే వారి వార‌సులు ఒక‌రి త‌రువాత ఒక‌రు టికెట్లు ప్ర‌క‌టించేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌న‌లో భాగంగా స‌భ‌లో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ప్ర‌క‌టించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న టిక్కెట్ ఖాయమ‌నే సంకేతాలిచ్చారు.

తాజాగా ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ క‌విత కూడా ప‌రోక్షంగా కాదు ఏకంగా పేరుతో స‌హా స‌భావేదిక‌పై జ‌గిత్యాల టికెట్ క‌న్ఫ‌మ్ చేసేశారు. ఇన్నాళ్లు జ‌గిత్యాల ఎమ్మెల్యేగా క‌విత పోటీచేస్తార‌నే వార్త‌లు ఊపందుకున్న నేప‌థ్యంలో ఆమే జ‌గిత్యాల అభ్య‌ర్థిపేరు ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. జ‌గిత్యాల ప‌ర్యట‌న‌లో భాగంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో వేదిక‌పైనే కాబోయే ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంజ‌య్ కి క‌విత బెర్త్ ఖాయం చేసార‌నే సంకేతాలు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి.