ఫసక్.. చాలా సరదా !

‘ఫసక్’ పదం మంచు ఫ్యామిలీ బ్రాండ్ గా మారింది. ఇటీవల ఇండియా టుడే టెలివిజన్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు, సినియర్ హీరో మోహన్ బాబు తన సినీ ప్రస్థానం గురించి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ‘యం. ధర్మరాజు’ సినిమా సన్నివేశాన్ని వివరిస్తూ ‘ఫసక్’ అనే పదాన్ని ఉపయోగించారు. ఇక, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ పదంతో కొన్ని వందల ట్రోల్ పోస్టులు, వీడియోలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇదే ట్రెండింగ్. తాజాగా, దీనిపై మోహన్‌బాబు కూడా స్పందించారు. ‘‘#fasak ట్రెండ్‌ కావడం సంతోషం. నేను వాడిన మాటను ఉపయోగించి దాదాపు 200 స్పూఫ్‌ వీడియోలు వచ్చాయని విష్ణు చెప్పాడు. కొన్ని చూశాను కూడా. చాలా ఫన్నీగా ఉన్నాయి’ అని ట్వీట్‌ చేశారు.

‘ఫసక్’ కామెంట్స్ అన్నీ.. నవ్వుకోడానికే తప్ప నొచ్చుకోడానికి కాదు అంటూ ఓ నెటిజన్‌ ట్విట్ చేశాడు. ‘అన్నా..బయట జనాలు ‘ఫసక్‌’ అని ట్రోల్‌ చేసినా అది మీ మీద, మీ కుటుంబంపై ఉన్న ప్రేమ వల్లే. బాధపడకండి. మా అందరికీ మంచు కుటుంబం అంటే చాలా ఇష్టం’ అని ట్వీట్‌ చేశారు. ఇందుకు మనోజ్‌ ప్రతిస్పందిస్తూ..‘తిట్టినా.. పొగిడినా..ఆడుకున్నా..మీరే కదా బ్రదర్స్‌. మీరు పెట్టే కూడు తింటున్నాం. మాపై మీకు ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది. ఎంజాయ్‌’ అని పేర్కొన్నారు మనోజ్‌. మొత్తంగా ‘ఫసక్’ ట్రోల్ ని మంచు ఫ్యామిలీ చాలా సరదా తీసుకొంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండీ అంటూ మోహన్ బాబు నుంచి వార్నిగ్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. ఆయన కూడా నెట్’యిజర్స్ సరదాని సరదాగా తీసుకొన్నారు.. మరీ.. !