జగపతి బాలీవుడ్ లుక్ లీక్ !

విలన్ గా టర్న్ తీసుకొన్న సీనియర్ హీరో జగపతి బాబు హవా మాములుగా లేదు. తెలుగు, తమిళ్, మలయాళ బాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 13 సినిమాలున్నాయి. ఇందులో ఓ బాలీవుడ్ చిత్రం కూడా ఉంది.

చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం “తానాజీ”. ఓం రావత్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్‌ తానాజీ పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ టెస్టుని ఇటీవల నిర్వహించారు. ఇప్పుడా లుక్ కి సంబంధించిన పిక్ బయటికొచ్చాయి. గుబురు గెడ్డెంతో అచ్చం సర్థార్ జీ లుక్ లో జగపతి బాబు లుక్ అదిరిపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ లోనూ బిజీ అయిపోవచ్చేమో..!