ఆ తరువాతే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ..
వివాదాస్పద వ్యాఖ్యలతో హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. తనను ఎందుకు నగరం నుంచి బహిష్కరించారో, తాను చేసిన తప్పేమిటో తెలంగాణ పోలీసులు చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ పోలీసుల చర్యలతో తాను తన బతుకుదెరువును కోల్పోయానని ఆయన అన్నారు. ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి, కోర్టులో తేల్చుకోవాలిగానీ ఇలా గూండా యాక్ట్ పెట్టేంత తప్పేం చేశానో అర్థం కావట్లేదని కత్తి మహేశ్ అన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ ఆలోచించుకోలేక పోతున్నానని, ప్రస్తుత పరిస్థితినుంచి బయటపడిన తరువాత అప్పుడు పొలిటికల్ ఎంట్రీపై ఓ క్లారిటీ వస్తుందని, అప్పుడే నిర్ణయం తీసుకోగలుగుతానని ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.