కేసీఆర్ పోటీపై కోదండరాం ఆసక్తికర వ్యాఖ్య…
ముందస్తు ఎన్నికలపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీపై టీజేఎస్ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల వల్ల తమకు ఎన్ని ఇబ్బందులో.. అధికార పార్టీకి కూడా అన్నే ఇబ్బందులని ఆయన అన్నారు. ఆఖరి ఆరునెలల్లో చేసుకుందామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని పనులను ఆపుకున్నారని, అలాంటి ఎమ్మెల్యేలకు ముందస్తు పిడుగులాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నిర్మాణం గ్రామల్లో వేగంగా జరుగుతోందని, పొత్తులపై చర్చలు జరపమని ఆయన స్పష్టం చేశారు. తమకు చాలా దారులున్నాయని, ఆమ్ ఆద్మీ, యోగేంధ్ర యాదవ్ లాంటోళ్ళు తమతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు.
తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలొస్తే అంత మంచిందని, ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నాడని ఆయన చెప్పారు. ప్రాజక్టులపై విచారణ జరిపితే అనేన మంది కాంట్రాక్టులు, నాయకులు జైలుకు పోతారన్నారు కోదండరాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ గజ్వేల్ నుంచి పోటీ చేయరని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం చూసుకుంటారు కానీ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చటానికి ముహూర్తం పెట్టుకున్నారని విమర్శించారు. సొంత భూములున్నందునే.. కొంగర్ కొలాన్ లో ప్రగతి నివేదన సభ పెట్టారనే విమర్శలున్నాయని ఆయన అన్నారు.