టీఆర్ఎస్ అభ్యర్తుల తొలి జాబితా సిద్ధం..!?
అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాల నేపథ్యంలో టీఆర్ఎస్ తొలిజాబితా సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. తొలిజాబితాలో చోటు దక్కించుకున్నవారెవరనే ఆసక్తి పార్టీలో మొదలైంది. గురువారం ఒకవేళ అసెంబ్లీ రద్దు చేసినా వెంటనే అభ్యర్థులను ప్రకటించకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారంహుస్నాబాద్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించనున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హుస్నాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ తో పాటు మిగతా అభ్యర్థుల జాబితాను కూడా కేసీఆర్ విడుదల చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ ను నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు. జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ పోటీ చేస్తారని వెల్లడించారు. ప్రజలు ఆయనకు అండగా నిలవాలని కోరారు. కాబోయే ఎమ్మెల్యే సంజయ్ అని ఎంపీ కవిత సంబోధించారు. కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను తనకన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ గతంలో కరీంనగర్ సభలో వ్యాఖ్యానించారు. దీంతో పాటు కామారెడ్డి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేరును కేటీఆర్ మంగళవారం తెలంగాణభవన్‌లో ప్రకటించారు. కేటీఆర్, కవిత ప్రకటించిన పేర్లతో పాటు వివిధనియోజకవర్గాల్లో ఒక అంచనామేరకు తొలిజాబితా ఇలా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
గజ్వేల్- కేసీఆర్, హుజూరాబాద్- ఈటెల రాజేందర్, సిద్దిపేట-హరీశ్‌రావు, బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్-జోగు రామన్న, పరిగి- కొప్పుల ఈశ్వర్, బోథ్-జి. నగేశ్, కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు, తాండూర్-పి. మహేందర్‌రెడ్డి, డోర్నకల్- సత్యవతి రాథోడ్, ధర్మపురి- కొప్పుల ఈశ్వర్, వరంగల్ (వెన్ట్)-దాస్యం వినయ్ భాస్కర్,
వేములవాడ- సి.హెచ్ రమేశ్ బాబు లేదా తుల ఉమ, కరీంనగర్ – గంగుల కమలాకర్, కోరుట్ల – విద్యాసాగర్ రావు
చెన్నూరు- బాల్క సుమన్, ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి, జుక్కల్ – హన్మంత్ షిండే, కామారెడ్డి- గంప గోవర్ధన్
రామగుండం- సోమారపు సత్యనారాయణ లేదా కోరుకంటి చందర్, స్టేషన్ ఘన్ పూర్ – టీ. రాజయ్య లేదా డాక్టర్ కావ్య
సిరిసిల్ల- కే.టీ.ఆర్, సికింద్రాబాద్- టి. పద్మారావు, సూర్యాపేట-జగదీశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్- వి. శ్రీనివాస్ గౌడ్
వనపర్తి- నిరంజన్ రెడ్డి, సత్తుపల్లి- పిడమర్తి రవి, నర్సంపేట- సుదర్శన్ రెడ్డి, జడ్చర్ల – సి. లక్ష్మారెడ్డి, బోధన్- షకీల్ అహ్మద్.
ఆలేరు – గొంగడి సునీత, అచ్చంపేట- గువ్వల బాలరాజు, దేవరకద్ర- ఎ. వెంకటేశ్వరరెడ్డి, మానకొండూరు- రసమయి బాలకిషన్, హుస్నాబాద్ -వి. సతీష్ కుమార్, జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లేదా ఎర్రబెల్లి దయాకరరావు
దేవరకొండ- బాలు నాయక్, గద్వాల- కృష్ణమోహన్ రెడ్డి, నకిరేకల్ – వేముల వీరేశం, మేడ్చల్ – సుధీర్ రెడ్డి
మెదక్ – పద్మాదేవేందర్ రెడ్డి, వర్ధన్నపేట- ఆర్రూరి రమేశ్, బెల్లంపల్లి- జి.వినోద్, నాగర్ కర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి
ఆర్మూర్ – ఏ. జీవన్ రెడ్డి, ఆసిఫాబాద్ – కోవా లక్ష్మీ, బాల్కొండ – వి. ప్రశాంత్ రెడ్డి, పటాన్‌చెరు – మహిపాల్‌రెడ్డి లేదా గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి – చింతా ప్రభాకర్.