స్వ‌లింగ సంప‌ర్కంపై సుప్రీం సంచ‌ల‌న తీర్పు..!

స్వలింగ సంపర్కం నేరమా.. కాదా.. అనే అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు ధర్మాసనం తీర్పు వెలువ‌రించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నలుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీర్పునిచ్చారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న‌ తీర్పునిచ్చింది. ఈ చర్యను ఐపీసీలోని సెక్షన్ 377 పరిధిలోకి రాదంటూ స్పష్టం చేసింది.వ్యక్తిగతంగా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని , భావవ్యక్తీకరణను నిరాకరించడం అంటే అది మరణంతో సమానమ‌ని ధర్మాసనం వ్యాఖ్యానించింది.