అసెంబ్లీ ర‌ద్దు.. ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా కేసీఆర్.

ఊహించిందే జ‌రిగింది. అనుకున్న ముహూర్తం ప్ర‌కార‌మే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశారు. కేబినెట్ భేటీతో ఏక‌వాక్య తీర్మాణంతో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనంత‌రం రాజ్ భ‌వ‌న్ కు చేరుకుని గ‌వ‌ర్న‌ర్ కు తీర్మాణం కాపీని అందించారు. ప్ర‌త్యేక బ‌స్సులో మంత్రుల‌తో క‌లిసి రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్న కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ కు తీర్మాణం కాపీ అందించారు. అసెంబ్లీ ర‌ద్దు తీర్మాణాన్ని గ‌వ‌ర్న‌ర్ ఆమోదించి, కేసీర్ ను ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టిస్తూ గెజిట్ ను విడుద‌ల చేశారు.