గాంధీ కుటుంబం చెప్పుకు కూడాసరిపోరు..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని, కేసీఆర్ గాంధీ కుటుంబం చెప్పుకు కూడా సరిపోరని ఆయన విమర్శించారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని, కేసీఆర్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాలని పీసీసీకి సూచించారు.