పట్టు దొరికింది
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్ లో భారత పేసర్లు ప్రతాపం చూపించారు. పేసర్లు ఇషాంత్, బుమ్రాతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజా విజృంభించడంతో ఇంగ్లాండ్ 198 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బట్లర్ (11), రషీద్ (4)తో కలిసి క్రీజులో ఉన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 123/1 పటిష్టంగానే కనిపించింది. ఐతే, ఒక్క సెషన్ ఆ జట్టును ఆత్మరక్షణలో నెట్టేసింది టీమిండియా. ఇషాంత్‌శర్మ (3/28), బుమ్రా (2/41), జడేజా (2/57) విజృంభించడంతో.. 198 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న అలిస్టర్ కుక్ (71; 190 బంతుల్లో 8×4) అర్ధసెంచరీతో మెరిశాడు.
ఈ టెస్టు సిరీస్ లో భారత బౌలర్లు బాగానే రాణిస్తున్నారు. ఐతే, బ్యాట్స్ మెన్స్ వైఫల్యం కారణంగా ఇప్పటికే టెస్టు సిరీస్ ని కోల్పోవలసి వచ్చింది. ఇక, ఆఖరి ఐదవ టెస్టులోనూ భారత బౌలర్లు బాగానే రాణించారు. రెండో రోజు మిగిలిన 3వికెట్లు ఎంత త్వరగా అవుట్ చేస్తారన్న దానిపై కోహ్లీ సేన విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత మ్యాచ్ ల్లోనూ ఆరంభంలో అదరగొట్టిన కోహ్లీసేన ఆ తర్వాత ఉదాసీనంగా వ్యవహరించి మ్యాచ్ లని చేజార్చుకొంది.
స్కోర్ వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ :
కుక్ (బి) బుమ్రా 71; జెన్నింగ్స్ (సి) రాహుల్ (బి) జడేజా 23; అలీ (సి) పంత్ (బి) ఇషాంత్ 50; రూట్ ఎల్బీ (బి) బుమ్రా 0; బెయిర్‌స్టో (సి) పంత్ (బి) ఇషాంత్ 0; స్టోక్స్ ఎల్బీ (బి) జడేజా 11; బట్లర్ బ్యాటింగ్ 11; కరన్ (సి) పంత్ (బి) ఇషాంత్ 0; రషీద్ బ్యాటింగ్ 4
బౌలింగ్ :
బుమ్రా 21-9-41-2; ఇషాంత్ 22-10-28-3; హనుమ విహారి 1-0-1-0; షమి 22-7-43-0; జడేజా 24-0-57-2