కేసీఆర్ కు జానారెడ్డి సవాల్..
ప్రజా ఆశీర్వాద సభలో జానారెడ్డిపై కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కేసీఆర్ మరోసారి పచ్చి అబద్దాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. కరెంట్ ఇస్తే నేను టీఆరెస్ కండువా కప్పుకుంటా అని ఎప్పుడు అనలేదని, అసెంబ్లీలో నేను గులాబీ కండువా కప్పుకుంటానన్న వీడియో బయట పెట్టాలని , అది న నిరూపిస్తే తాను రాజకీయంగా అస్థ్రసన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.
కేసీఆర్ కు 24గంటలు గడువిస్తున్నానని, బయటపెట్టకపోతే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. 2018 లోపు 24 వేల 570 మెగావాట్ లు ప్రభుత్వం ఉత్జ్పత్తి చేస్తే అద్భుతం అని మాత్రమే తాను అన్నానని, మరి అదికూడా కేసీఆర్ సర్కార్ ఉత్పత్తి చేయలేదుగా అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను మీడియా ముందు పెట్టారు జానారెడ్డి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టకపోతే తాను ఓట్లు అడగనన్న కేసీఆర్ ..ఇప్పుడు ఏమంటారని ఆయన ప్రశ్నించారు. అలవోకగా అబద్దాలు చెప్పడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.
అబద్దాలతో రాజకీయాల్లో విలువలు తగ్గించ వద్దని ఆయన హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం రెండుపంటలకు ..కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తే తాను టీఆరెస్ కు ప్రచారం చేస్తా అన్నది నిజమేనని, దానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. ఎక్కడ కోటి ఎకరాలు .. ఎక్కడ రెండు పంటలకు నీరు ఇస్తున్నారో కేసీఆర్ చూపాలన్నారు.