పెట్రో ధరల పెరుగుదలకు అసలు కారణాలవే.. !

దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. నెలలో మూడ్నాలుగు సార్లు కాదు. ప్రతి రోజు పెట్రో రేటు పైపైకి వెళ్తోంది. ఈ మంటలు మనదేశంలోనే కాదు. ఇతర దేశాల్లోనూ కొనసాగుతోంది. ఐతే, ఆ ప్రభావం మనదేశంలో కాస్త ఎక్కువగా ఉంది. దీనికి అసలు కారణలేంటో తెలుసా.. ?

* ఇరాన్‌ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడం ప్రధాన కారణం

* ఈ యేడాది నవంబర్ 4వ తేది నుంచి ఇరాన్ పై అమెరికా ఆంక్షలు అమలుకానున్నాయి. ఐతే, అంతకంటే ఆర్నేళ్ల ముందే ఇరాన్‌ చమురుపై ఆధారపడిన వివిధ దేశాలకు ఇక్కట్లు మొదలయ్యాయి.

* ఇరాన్‌ ముడి చమురు సరఫరాని తగ్గిస్తేనే ఇన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఆ దేశం మొత్తానికే సరఫరా ఆపెస్తే.. ధరలు ఇంకెంతగా పెరుగుతాయి అన్నది ఊహించడానికి భయమేస్తోంది.

* దీనికి తోడు నానాటికీ పడిపోతున్న రూపాయి విలువ భారత చమురు మార్కెట్‌ను కకావికలు చేస్తోంది.

* ధరలు ఇంతగా పెరిగిపోతున్నా.. సుంకాల్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. ఇప్పుడీ అంశంపైనే కాంగ్రెస్, విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇందుకు నిరసనగానే నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.