సునీల్-అల్లరి నరేష్’ల మధ్య కోట్లాట.. !

సిల్లీ ఫెలోస్ సునీల్-అల్లరిలు నరేష్ ఆస్థి కోసం కోట్లాటకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా వీరిద్దరు కలిసి నటించిన ‘సిల్లీ ఫెలోస్’ సంబంధించిన ఆస్తికావడం విశేషం. అవును.. ‘సిలీ ఫెలోస్’ సినిమా కథ రూ. 500కోట్ల చుట్టూ తిరుగుతుంది. ఇదే కాన్సెప్టుని నాని బిగ్ బాస్ హౌస్ లో వాడేశాడు. ఆదివారం బిగ్ బాస్ షోకి సిల్లీ ఫెలోస్ సునీల్, నరేష్ గెస్టులు వచ్చారు. వీరిద్దరు ఇంటి సభ్యులతో కలిసి సరదాగా గేమ్ ఆడారు. అసలు గేమ్ ఏంటంటే.. ? ఓ తండ్రి ఆయనకి ఇద్దరు కొడుకులు సునీల్, నరేష్ లు. ఆ తండ్రి చనిపోతూ.. రూ. 500కోట్ల దాచిపెట్టారు. ఆ ఆస్తి ఇద్దరి కొడుకుల్లో ఎవరికి చెందాలి ? ఎందుకు ?? అనేది డిబెట్.

ఇందుకోసం సునీల్, నరేష్ లు రెండు టీమ్ లుగా విడిపోయి.. వాదనకి దిగారు. ఆ కొట్లాట ఫుల్ వినోదాన్ని పంచింది. మధ్యలో నరేష్, నానిల అరెయ్.. ఓరెయ్ మాటలు ఆకట్టుకొన్నాయి. ఈ గేమ్ లో నాని పెద్దరాయుడు పాత్రని పోషించారు. దాన్ని ఉద్దేశించి నాని పెద్దమనిషి అయ్యాడని అల్లరోడు సటైర్ వేసి నవ్వులు పూయించాడు. ఇక, ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అవ్వడం ఇది రెండోసారి. తొలిసారి ఎలిమినేట్ అయిన పబ్లిక్ పోల్ తో ఆమె మళ్లీ బిగ్ బాస్ ఇంటిలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ వారం ఆమె తక్కువ ఓట్లు నమోదు కావడంతో మరోసారి ఎలిమినేట్ కాకతప్పలేదు.