సమంతని హద్దుల్లో పెట్టుకొన్నాడట.. !!

హీరో నాగ చైతన్య ఆయన భార్య, స్టార్ హీరోయిన్ సమంతని హద్దుల్లో పెట్టుకొన్నాడట. చైతూ అనుమతి లేనిదే సామ్ ఏ పని చేయడట. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది సామ్. పర్సనల్, సినిమాలకు సంబంధించిన విషయాలని వారితో పంచుకొంటూ ఉంటుంది. భర్త చైతూతో దిగిన ఫోటోలని పోస్టు చేస్తుంటుంది. అవి చూసి అక్కినేని అభిమానులు ఆనందంగా ఫీలవుతుంటారు. ఐతే, సామ్ సోషల్ మీడియాలో ఏ కామెంట్ పెట్టినా, ఏ ఫోటో పోస్ట్ చేసినా.. భర్త చైతూ అనుపతి తీసుకొంటుందట. ఈ విషయాన్ని సామ్’నే తెలిపింది. దీంతో సామ్’ని చైతూ బాగానే హద్దుల్లో పెట్టుకొన్నాడని చెప్పుకొంటున్నారు.

ఇక, పెళ్లి తర్వాత చైతూ, సామ్ ల కెరీర్ మరింత ఊపందుకొన్న సంగతి తెలిసిందే. ఇద్దరు వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఈ వారం అయితే సమంత, చైతూ బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగనున్నారు. సమంత నటించిన ‘యూటర్న్’, చైతూ ‘శైలజారెడ్డి అల్లుడు’
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సమంత నటించిన తమిళ చిత్రం ‘సీమ టపాకాయ్’ కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సామ్ నుంచి వస్తున్న రెండు చిత్రాలు, చైతూ ‘శైలజారెడ్డి అల్లుడు’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరీ.. భార్యభర్తల బాక్సాఫీసు యుద్ధంలో విజయం ఎవరిది ? అనేది చూడాలి.