డిపోమేనేజర్ ఫోన్ ఎత్తి ఉంటే…
జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదంపై నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు ఫిట్ నెస్ లేకపోవడం ఒక కారణమైతే, బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి మరో కారణంగా చెబుతున్నారు స్థానికులు. బస్సు వెళ్లే సమయంలో గ్రామ పెద్ద పునుగోటి కృష్ణా రావు అక్కడ వున్న వారితో ఈ రోజు బస్సులో చాలామంది వెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పక్కనే వున్న ఊరి అతను రోజు నిండుగా నే వెళ్తున్నారు కానీ ఈ మద్య బస్సును దొంగల మర్రి మీదుగా కాకుండా కొండగట్టు నుంచి వెళ్తుంది సార్ అంటూ సమాధానమిచ్చారట.
దీంతో తన ఫోన్ తీసి డిపో మేనేజర్ కు ఫోన్ చేశాడు కృష్ణారావు. డిపో మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తరువాత చేద్దాంలే అనుకుంటూ ఫోన్ కట్ చేశాడతను. పది పదిహేను నిమిషాల తరువాత కృష్ణా రావుకు ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తే సరికి అటు వైపు నుంచి ఏడుస్తూ సార్ మన శనివార పేట బస్సు లొయోలో పడిపోయింది సార్ మన గ్రామాలకు ఎక్కువ వున్నారు అనే మాట వినిపించింది. డిపో మేనేజర్ ఫోన్ ఎత్తి ఉంటే బహుశా ఇంతటి ఘోరం జరగకపోయేదేమో అనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.