ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఇదే పెద్ద ప్ర‌మాదం..! డిపోమేనేజ‌ర్ పై వేటు

జ‌గిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టు వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాద క్ష‌త‌గాత్రుల‌ను మంత్రులు కేటీఆర్, ర‌వాణాశాఖ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీ కవిత‌ పరామ‌ర్శించారు. ప్ర‌మాదానికి గల కార‌ణాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. బ‌స్సు ప్ర‌మాదంలో 52మంది చ‌నిపోయార‌ని, ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఇది పెద్ద ప్ర‌మాద‌మ‌ని మంత్రులు తెలిపారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున 5ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా తోపాటు 3ల‌క్ష‌లు పార్టీ నుంచి సాయం అందిస్తామ‌ని మంత్రులు కేటీఆర్, మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పారు. క్ష‌త‌గాత్రుల‌కు ఖ‌రీదైన వైద్యం అందిస్తామ‌ని వారు తెలిపారు. బాద్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించి ఇంటి ఘోర ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డిపోమేనేజ‌ర్ ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ర‌వాణా మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు.