బిగ్ బాస్.. నాన్నకు ప్రేమతో !
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ఆఖరి అంకానికి చేరుకొంది. ఇప్పటికే 94రోజులకిపైగా షో పూర్తయ్యింది. ఇక, మిగిలింది ఆరు రోజులు మాత్రమే. ఐతే, మంగళవారం ఏపీసోడ్ లో ఇంటి సభ్యులని బిగ్ బాస్ సప్రైజ్ చేశాడు. వారి పిల్లలని ఇంట్లోకి పంపించారు. దీప్తి తనయుడు అమ్మా అంటూ పరుగెత్తుకొంటూ వచ్చాడు. అమిత్ తనయుడుని చూసి మురిసిపోయాడు. ఇక, పిల్లలు లేని సామ్రాట్ ని కలవడానికి ఆయన తల్లి వచ్చారు.
ఇక, బుధవారం నాటి షోలో కౌశల్ ఇద్దరు పిల్లలు హౌస్ లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే స్టార్ మా విడుదల చేసింది. ఇందులో తన ఇద్దరు పిల్లలని చూసి కౌశల్ ఎమోషనల్ అవ్వడం చూడొచ్చు. దానికి తగ్గట్టుగానే ప్రోమోకు నాన్నకు ప్రేమతో కాప్షెన్ పెట్టారు. ఇప్పుడీ ప్రోమో తెగ ఆకట్టుకొంటోంది. ఆ ప్రోమోపై మీరు ఓ లుక్కేయండీ.. !
నాన్నకు ప్రేమతో ❤️🤗#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/mPZZ1StECF
— STAR MAA (@StarMaa) September 12, 2018