సప్రైజ్ : ‘శైలజారెడ్డి అల్లుడు’లో నాని

‘శైలాజారెడ్డి అల్లుడు’ నాగ చైతన్య సప్రైజ్ ఇచ్చాడు. వినాయక చవితి కానుకగా అల్లుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య-అను ఇమ్మాన్యూయేల్ జంటగా తెరకెక్కిన చిత్రమిది. అత్త శైలజారెడ్డిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించారు. ఐతే, అల్లుడులో నేచురల్ స్టార్ నాని కనిపించాడు. కాదు.. కాదు వినిపించాడు. నాని వాయిస్ ఓవర్’తో సినిమా టైటిల్స్ పడ్డాయి. అది సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. అంతకుముందు హరికృష్ణకి నివాళులర్పిస్తూ సినిమా స్టార్ట్ అయ్యింది.

నాగచైతన్యని తెరపై ఎక్కువగా ప్రేమికుడిగానే చూశాం. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకి కాస్త దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఆయన్ని వచ్చిన మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇది వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో చైతూ వినోదాన్ని పంచబోతున్నాడు. ఇప్పటికే అల్లుడు బినిఫిట్ షోస్ పడిపోయాయి. సినిమా చాలా సరదాగా సాగుతుందని పబ్లిక్ టాక్ బయటికొచ్చేసింది. మరీ.. కొద్దిసేపట్లో పూర్తి రివ్యూ రానుంది.