‘శైలజారెడ్డి అల్లుడు’ ఎలా ఉన్నాడంటే ?
‘శైలజారెడ్డి అల్లుడు’గా నాగ చైతన్య ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య-అను ఇమ్మాన్యూయేల్ జంటగా తెరకెక్కిన చిత్రమిది. అత్త శైలజారెడ్డిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వినాయక చవితి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఉదయం పూట ఆట మొదలైపోయింది. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది.
నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది. మురలిశర్మ నాగ చైతన్య తండ్రిగా కనిపించారు. తొలి చూపులోనే హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, చైతన్య అనుకి డిఫరెంట్ గా ప్రపోజ్ చేయడం, మధ్యలో వెన్నల కిషోర్, రఘుబాబుల కామెడీతో ఫస్టాఫ్ సరదగా సాగింది. అత్త శైలజారెడ్డి పాత్ర ఎంట్రీతో ఇంటర్వెల్ పడింది.
సెకాంఢాఫ్ శైలజారెడ్ది ఇంట్లోకి నాగ చైతన్య అడుగుపెట్టడం.. అక్కడ వినోదాత్మక సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ లో తల్లి మరియు కుమార్తె మధ్య అంతరాన్ని దారితీసిన కారణాలు చూపించారు. క్లైమ్కాస్ యాక్షన్ ఏపీసోడ్.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సినిమాని ముగించాడు దర్శకుడు మారుతి. మొత్తంగా శైలాజారెడ్డి అల్లుడు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాడు.