మళ్లీ ఢిల్లీకి ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సీపీఐతో పొత్తు, సీట్ల సర్దుబాటు గురించి ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో చర్చించనున్నారు. ఐతే, ఉత్తమ్ తరచూ ఢిల్లీకి వెళ్లడం తెలంగాణ కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతోంది. ఈ గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ని విరివిగా వాడుకొన్న తెరాస ఈ దఫా ఎన్నికల్లో గల్లీ-ఢిల్లీ అంశాన్ని తెరపైకి తెచ్చింది.

తెలంగాణకు సంబంధించిన నిర్ణయాలు ఢిల్లీలో జరగలా.. ? గల్లీ (తెలంగాణ గడ్డమీద)లో జరగాలా ? తేల్చుకోవాలని కేటీఆర్ ప్రజలకి సూచిస్తున్నారు. ఈ పాయింట్ తెలంగాణ ప్రజలని ఆలోచింపజేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రతి చిన్న నిర్ణయానికి
ఆ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్తుంటారు. ఇక్కడ నేతలు అధికారంలో ఉన్న రిమోట్ మాత్రం ఢిల్లీలో ఉంటుంది.

ఢిల్లీ నిర్ణయాల ఎలా ఉంటాయన్నది తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకొని యుటర్న్ తీసుకోవడం.. ఆ తర్వాత ఎన్నికల ముందు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం చూశాం. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణలో ఢిల్లీ పెత్తనం వస్తుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. అది నిజమే అన్నట్టు ఉత్తమ్ గడికి ఢిల్లీకి వెళ్లడం టీ-కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతోంది. మరీ.. ఉత్తమ్ ఊరికే గీ ఢిల్లీ టూర్స్ ఎందుకు ? ఒకేసారి అన్ని అరుసుకొని వస్తే మంచిందేమో.. !