చెట్టు గణపతిని చూశారా.. ?

వినాయక చవితిని పురస్కరించుకొని గల్లీ గల్లీ గణపతులు వెలిశాయి. ఐతే, వీటిలో కొన్ని ప్రత్యేకంగా ఆకట్టుకొంటున్నాయి. అన్నింటి కంటే భిన్నంగా చెట్టు గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చెట్టుగణపతి ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘కాన్సెప్ట్ అదిరిపోయింది. నేను రాయి, టెంపుల్… లోనే కాదు చెట్టులోనూ చెట్లలోనూ ఉన్నా. అందుకే మంచి భవిష్యత్ కోసం చెట్లు నాటండి’ అనే కామెంట్ పెట్టాడు. ఇప్పుడీ చెట్టు గణపతి, అక్షయ్ కామెంట్ రెండు ఆకట్టుకొంటున్నాయి.