రజనీ పాత్రలో నాగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకుడిగా మారి తీసిన చిత్రం ‘పవర్ పాండి’. మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ధనుష్ దర్శకుడిగా తన రెండో సినిమాగా ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ఇందులో మరో హీరోగా నాగ్ ని తీసుకొన్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా మధురైలో జరిగిన షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో నాగార్జున జాయిన్ కానున్నారట. ఐతే, ఈ సినిమాలో నాగార్జునగారు చేస్తోన్న పాత్రని సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం రాసుకొన్నదట. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రజనీ ఇప్పుడా పాత్రలో నటించలేనని చెప్పాడట. దాంతో ఆ పాత్ర కోసం నాగ్ ని తీసుకొన్నారంట.

ఇప్పుడు రజనీ కోసం అనుకొన్న పాత్రలో నాగ్ ఏ విధంగా కనిపించబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దాదాపు రూ. 70కోట్ల బడ్జెట్ తో ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. అతిథి రావు, అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్స్ గా ఎంపిక చేశారు. ఇక, ప్రస్తుతం నాగ్ నానితో కలిసి దేవదాస్ చిత్రంలో నటిస్తున్నారు.