చరణ్-సమంతలకు 10కోట్లు
‘బాహుబలి’ దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసింది ‘రంగస్థలం’. తెలుగులో బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా ‘రంగస్థలం’ నిలిచింది. ఈ చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ 1980 నాటి పరిస్థితుల నేపథ్యంలోని కథని ఎంచుకొన్నాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని
ఆనాటి పరిస్థితులకి తీసుకెళ్లాడు. చిట్టిబాబు (రామ్ చరణ్), రామలక్ష్మీ (సమంత), కుమార్ బాబు (ఆది పినిశెట్టి), రంగమ్మత్త (అనసూయ), ప్రెసిడెంటు (జగపతి బాబు) పాత్రలని అద్భుతంగా తీర్చిద్దాడు. ఫలితంగా రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఏకంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఎంచుకొన్న కథ ఒక్కతైతే.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. ప్రతి పాటకు వైవిధ్యం కలిగిన ఆల్బమ్ అందించాడు. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. ఇక, ‘రంగమ్మ మంగమ్మ.. ‘ సాంగ్ ఆడియన్స్ చేత కేకలు పట్టించింది. ఇప్పుడీ సాంగ్ అరుదైన రికార్డుని సొంతం చేసుకొంది. ఈ పాటకు యూట్యూబ్ లో 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్ దక్కాయి. ఈ పాటని ప్రముఖ సింగర్ ఎంఎం మానసి పాడారు.