యువతి చేతిలో యువకుడి నగ్న ఫోటో

ఓ యువతి.. యువకుడిపై బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు బ్యాటరీల పనిచేస్తుంటాడు. అతనికి ఫేస్‌బుక్‌ ద్వారా ఓ యువతి పరిచయం అయింది. తరచుగా ఇద్దరూ ఛాటింగ్‌ చేసుకునేవారు.

తాను గుంటూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నానని, తనకు వివాహమైందని, భర్త హైదరాబాద్‌లో పనిచేస్తాడని, ఒక పాప కూడా ఉందని ఆ యువతి చెప్పింది. ఇటీవల ఆమె తన నగ్నచిత్రం అంటూ ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో యువకుడికి పోస్టు చేసింది. నువ్వు కూడా నీ నగ్నచిత్రాన్ని పంపించాలంటూ, యువకుడిని కోరడంతో అతడూ పంపాడు.

ఆ ఫోటోని అడ్దుపెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసింది. లేదంటే ఆ యువకుడి నగ్న ఫోటోని అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తానంటూ బెదిరించడం ప్రారంభించింది. చివరికి ఆ యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.