అఖిల్ అంతకన్నా రసికుడు

యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన మూడో సినిమాలో మాంఛి మూడులో కనిపిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్‌ హీరోయిన్. ఈ చిత్రానికి ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్ ఖరారు చేశారు. బుధవారం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల చేశారు. ఇదో రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని టీజర్ తో అర్థమవుతోంది.

‘దేవదాసు మనవడో.. మన్మథుడి వారసుడో.. ’ అనే పాట టీజర్‌లో వినిపించింది. ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ మిస్‌.. ఏమిటో ఇంగ్లిషు బాష.. దేన్నయితే మిస్‌ చేయ కూడదో దాన్నే మిస్‌ అంటారు’’ అనే అఖిల్‌ డైలాగ్‌తో టీజర్‌ కట్‌ చేశారు. అఖిల్ ఈ రేంజ్ లో అమ్మాయిల వెంటపడటం ఇదే తొలిసారి. టీజర్’తో అఖిల్ మాంఛి రసికుడు అనిపించుకొన్నాడు. అదే రేంజ్’లో ఉందన్నది సినిమాలో చూడాలి. ‘మిస్టర్‌ మజ్ను’ని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం. బీవీవీఎస్ ప్రసాద్ నిర్మాత