బిగ్ బాస్ 2 ఫైనల్ ఏపీసోడ్.. ఎన్టీఆర్ డీల్ చేస్తాడా ?

బిగ్ బాస్ బిగ్ సప్రైజ్ ఇవ్వబోతున్నాడా ? బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ ఏపీసోడ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకొస్తున్నాడా.. ? అంటే అవుననే అంటున్నారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఈ వారం ఒక్కరు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురుతో ఫైనల్ ఏపీసోడ్ జరగనుంది. ఆ ఏపీసోడ్ ని అదిరిపోయేలా ప్లాన్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం.

ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నాగ్ తో పాటు తారక్ కూడా రాబోతున్నట్టు తెలిసింది. ఐతే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. తండృ హరికృష్ణని కోల్పోయిన బాధలో ఉన్న తారక్ ఎలాంటి కార్యక్రమంలో హాజరుకావడం లేదు. ‘అరవింద సమేత’ ఆడియో వేడుకని క్యాన్సిల్ చేసుకొన్నాడు. ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ కోసం తారక్ రాబోతున్నాడనే ప్రచారం నమ్మశక్యంగా లేదు. ఒకవేళ వస్తే.. మాత్రం నాగ్, తారక్, నాని లతో ఫైనల్ ఏపీసోడ్ అదిరిపోద్ది.