రష్మిక మందన.. స్టార్ హీరోయిన్ !

ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రష్మిక మందన. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ అనిపించుకొంది. ఆమె నటించిన రెండో సినిమా ‘గీత గోవిందం’ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ… ల లిస్టులో విజయ్ చేరిపోయాడు.

ఇప్పుడీ ‘గీత గోవిందం’ హీరోయిన్ రష్మిక మందన స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఈ విషయాన్ని కింగ్ నాగార్జున ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన దేవదాస్ ఆడియో వేడుకలో నాగ్ మాట్లాడుతూ.. రష్మిక స్టార్ హీరోయిన్ అవుతుందని ఆకాంక్షించారు. నాగ్ ది లక్కీ హ్యాండ్ అంటుంటారు. ఇక, ఆయన చెప్పింది కచ్చితంగా అవుతుందని చెబుతుంటారు. ఈ లెక్కన రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. ఇక, తెలుగులో రష్మిక నటించిన మూడో చిత్రంగా ‘దేవదాస్’ రానుంది.